calender_icon.png 27 December, 2024 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జామ ఆకులతో..

08-11-2024 12:00:00 AM

జామపండుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసు. అయితే జామ ఆకుల్లోనూ ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చనే విషయాలు చాలామందికి తెలియవు. ఆరోగ్యమైన జుట్టుకు జామ ఆకులు బాగా పనిచేస్తాయి. జామ ఆకులు సూక్ష్మక్రీములను నివారిస్తాయి. అలాగే ఆకులను నీటిలో ఉడకబెట్టి, ఆ నీటిని తాగితే కడుపు నొప్పిపోతుంది. జామ ఆకుల్ని తినటం వల్ల దంతాల ఆరోగ్యం బాగుంటుంది.

నోటిలోని చెడు బ్యా క్టీరియా సమస్యను తగ్గిస్తుంది. నోటి పొక్కులు కూడా పోతాయి. టీ చేసుకొని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలకు చెక్‌పెట్టొచ్చు. జామాకు టీ తాగటం వల్ల శ్వాసకోస సంబంధమైన సమస్యలు పోతాయి.

దగ్గును కూడా దూరం చేస్తుంది. ఈ ఆకుల్లో విటమిన్- బి పుష్క లంగా ఉంటుంది. ఇది కణాల నిర్మాణానికి బాగా పనిచేస్తుంది. ఇందులోని బి3, బి5, బి6 విటమిన్లు కూడా చర్మ సౌందర్యానికి మంచిది.