calender_icon.png 25 February, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటమి భయంతోనే..

25-02-2025 01:36:38 AM

  1. కాంగ్రెస్ పోటీచేస్తున్నది ఒక ఎమ్మెల్సీ స్థానంలోనే..
  2. మూడు చోట్ల బీజేపీదే విజయం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ అభ్యర్థుల కు మద్దతుగా సోమవారం నిర్వహించి న ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి నిరాశ, నిస్పృహతో మాట్లాడార ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నా రు. ఓటమి భయం సీఎం ప్రసంగం లో స్పష్టంగా కనిపించిందని విమర్శిం చారు. ఓడిపోతామనే భయంతోనే మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే కేవలం ఒక స్థానంలో మాత్రమే అభ్యర్థిని బరిలోకి దించార ని ఎద్దేవా చేశారు. మూడు చోట్ల  గెలిచేది బీజేపీయే అనే విషయాన్ని రేవంత్‌రెడ్డి ప్రసంగం స్పష్టం చేసింద న్నారు.

సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడి యా సమావేశంలో పాల్గొని మాట్లా డారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పా టు చేసినట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం భారీ స్థాయిలో బహిరంగ సభ లు ఏర్పాటు చేయడంపై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలు వారి ఓటమిని తేటతెల్లం చేస్తుందని దుయ్యబట్టారు.

ఎమ్మెల్సీ స్థానంలో గెలిచినా, గెలవకపోయినా తమ ప్రభుత్వానికి వ చ్చిన ప్రమాదమేమీ లేదని మాట్లాడటం ద్వారా ఎన్నికలకు ముందే రేవంత్‌రెడ్డి తమ ఓటమిని అంగీకరించారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి 14 నెలల పాలనంతా ద్రోహంతోనే గడించిందన్నారు. అన్ని వర్గాలనూ కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని ఆరోపించారు. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ సర్కారు ప్రజ లను పీడిస్తే... గత 14 నెలలుగా కాంగ్రెస్ ప్ర భుత్వం అదే పనిచేస్తోందని విమర్శించారు. 

అది బరాబర్ తప్పే...

ముస్లింలను బీసీల్లో చేరిస్తే తప్పేంటంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారని, అలా చేయడం బరాబర్ తప్పే అవుతుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బీసీల పేరుతో ముస్లిం లే రిజర్వేషన్లను లాక్కుంటున్నారని ఆరోపించారు. దీనికి జీహెచ్‌ఎంసీ ఎన్నికలే నిదర్శ నమన్నారు. ఎన్నికల్లో 50 డివిజన్లను బీసీలకు కేటాయిస్తే, బీసీ రిజర్వేషన్లను ఉపయో గించుకుని 33 స్థానాల్లో ముస్లింలు పదవులు పొందారని పేర్కొన్నారు. హైదరాబా ద్‌లో ప్రతి ముస్లిం బీసీల్లో చేరుతున్నారని, ఇది బీసీలకు నష్టం కలిగిస్తుందని వెల్లడించారు.

అయితే ఎప్పటి నుంచో బీసీల్లో ఉన్న దూదేకుల, నూర్ భాషా వర్గాలకు బీజేపీ వ్యతిరేకం కాదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభాకర్‌రావును బీజేపీ రక్షిస్తోందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఫోన్ ట్యా పింగ్ కేసుపై తామే హైకోర్టుకు వెళ్లినట్టు కేం ద్రమంత్రి గుర్తు చేశారు. అలాగే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ కూడా చేసినట్టు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్‌తో సీఎం కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ కేసును కాంగ్రెస్ సర్కారు వదిలి నా తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కిషన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.