calender_icon.png 1 January, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో పా.. పా

29-12-2024 12:00:00 AM

నిరుడు తమిళంలో మంచి ప్రేక్షకాదరణ పొందింది ‘డా..డా’ చిత్రం. తెలుగులో ‘పా.. పా..’ పేరుతో జేకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట విడుదల చేయనున్నారు. జనవరి 3న ఈ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియాల్లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంజీఎం సంస్థ నుంచి అచ్చిబాబు విడుదల చేయనున్నారు.

కవిన్, అపర్ణ దాస్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ గణేశ్ కే బాబు తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కించారు. భావోద్వేగం, ప్రేమ, కామెడీ మేళవింపుతో ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా పేరు తెచ్చుకుంది. అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం కోలీవుడ్‌లో సుమారు రూ.30 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.