calender_icon.png 22 October, 2024 | 11:23 PM

దాల్చిన చెక్కతో..

22-10-2024 12:00:00 AM

ఊబకాయం అనేది ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తోన్న సమస్య. బరువు పెరగడానికి.. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం రెండు ముఖ్యమైన కారణాలు. బరువుతో పాటు పొట్టలో కొవ్వు కూడా పెరుగుతుంది. శరీరంలో కొవ్వు కరగాలన్నా.. బరువు తగ్గాలన్నా.. ఉదయం పూట దాల్చిన చెక్క తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

* దాల్చిన చెక్క వంటగదిలో కనిపించే సుగంధ ద్రవ్యం. ఇది ఔషధగుణాలను కలిగి ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీర బరువు అదుపులో ఉంటుంది. 

* దాల్చిన చెక్క తినడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దాంతో ఆకలిగా అనిపించదు. 

* దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో బాగా పని చేస్తుంది. 

* ఒక గ్లాసు నీళ్లల్లో చిన్న సైజు దాల్చిన చెక్క ముక్క వేసి బాగా మరిగించాలి. ఈ మరిగించిన నీటిని ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపులో తాగితే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. 

* దీంతో హెర్బల్ టీ కూడా తయారు చేసుకోవచ్చు. హెర్బల్ టీ కోసం ఒక గ్లాసు నీటిలో దాల్చిన చెక్క ముక్క, అల్లం ముక్క, చిటికెడు పసుపు పొడి వేసి బాగా మరిగిస్తే సరిపోతుంది.