రాఘవ లారెన్స్ మళ్లీ జోరు పెంచారు. మంగళవారం ఆయన పుట్టిన రోజు. దీంతో రెండు చిత్రాలను నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. అందులో మొదటిది ఏ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పీ, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతోంది. ఇది లారెన్స్ హీరోగా నటిస్తున్న ౨౫వ చిత్రం. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సూపర్ హీరో ఫిల్మ్‌కు ‘కాల భైరవ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
కోనేరు సత్యనారాయణ, మనీష్ షా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ నిర్మాణ దశలో ఉంది. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌లో లారెన్స్ లుక్ ఆసక్తిని పెంచుతోంది. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. 2025 వేసవిలో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇక లారెన్స్ నటిస్తున్న మరో చిత్రం ‘బుల్లెట్ బండి’. ఇందులో ఎల్విన్ కూడా లీడ్ రోల్ చేస్తున్నారు. ఇన్నాసి పాండియన్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తుండగా కృతిరేసన్ నిర్మిస్తున్నారు. తాజా పోస్టర్‌లో లారెన్స్ పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించారు. తెలుగు లో రూపొందుతున్న ఈ మూవీలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.