calender_icon.png 18 January, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో పాన్ ఇండియా చిత్రంతో..

18-01-2025 12:00:00 AM

తొలి చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’తోనే తెలుగు యువతకు హాట్ ఫెవరెట్‌గా మారిపోయింది పాయల్ రాజ్‌పుత్. తర్వాత ఈ పంజాబీ ముద్దుగుమ్మ నటించిన ‘మంగళవారం’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవటంతో ఆమెకు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజీ ఏర్పడింది. ఈ క్రమంలో మరో పాన్ ఇండియా సినిమాతో వస్తోందీ బ్యూటీ.

ఆమె ప్రధాన పాత్రలో సినిమా టికెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, అర్జున్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఓ చిత్రం సిద్ధమవుతోంది. డైరెక్టర్ ముని కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించనున్న ఈ సినిమా జనవరి 24న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర చాలా భావోద్వేగపూరితంగా ఉండనుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రారంభం రోజు మేకర్స్ ప్రకటించనున్నారు.