calender_icon.png 23 October, 2024 | 1:03 PM

ఖాళీ కడుపుతో..

17-06-2024 12:05:00 AM

కూరలో రుచిని పెంచేందుకు వెల్లుల్లిని ఉపయోగిస్తారు. ఆహారం రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లిలో కార్బోహైడ్రేట్లు, కాపర్, ఫాస్పరస్, డైటరీ ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, మాంగనీస్, కాల్షియం, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే కలిగే ప్రయోజనాలెంటో తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యానికి..

ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. దీని వల్ల హార్ట్ స్ట్రోక్ రిస్క్ కూడా తగ్గుతుంది. 

జీర్ణవ్యవస్థకు..

జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లయితే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తప్పనిసరిగా వెల్లుల్లి రెబ్బలను తినాలి. దీంతో జీర్ణ సమస్యల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి.

శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది..

వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని సహజంగా డిటాక్సిఫికేషన్ చేయడంలో సహాయపడతాయి. దీంతో పాటు ఇవి కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.

బలమైన రోగనిరోధక శక్తి..

పచ్చి వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. రోజూ రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

అధిక రక్తపోటు తగ్గించడంలో..

అధిక రక్తపోటును తగ్గించడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ రక్తపోటుకు కారణమయ్యే యాంజియోస్టిన్ ౨ అనే ప్రోటీన్‌ను నిరోధిస్తుంది. దీంతో అధిక రక్తపోటు తగ్గుతుంది. 

జలుబుకు..

వెల్లుల్లి సప్లిమెంట్లు రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫ్లూ, జలుబు వంటి వ్యాధుల తీవ్రతను నివారించడంలో సహాయపడుతుంది. రక్తం గడ్డ కట్టడం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ రెండు వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్య దూరం అవుతుంది.