28-02-2025 12:00:00 AM
‘105 మినిట్స్’ అనే సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ చిత్రంతో ఒక వినూత్న ప్రయోగం చేసిన దర్శకుడు రాజా దుస్సా. ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలంగాణ యాస నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ అనే టైటిల్‌ను ఖరా రు చేశారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తొలి ప్రయత్నంగా పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని రూ పొందిస్తున్నట్టు తెలుస్తోంది. ‘దేశముదురు’ హీరోయిన్ హన్సిక మోత్వాని ఇందులో లీడ్ రోల్‌లో నటిస్తోంది. శ్రీరామకృష్ణ సినిమా బ్యానర్‌లో గాలి కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాంపల్లి సోమాచా రి, అలూరి రాజిరెడ్డి, రూప కిరణ్ గంజి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
టైటిల్ అనౌన్స్‌మెం ట్ సందర్భంగా డైరెక్టర్ రాజా దుస్సా మాట్లాడారు. ‘1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరంగల్ జిల్లాలో జరిగిన ఒక యధార్థ సంఘటనను తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. నటినటులు, మిగతా సాంకేతికవర్గం వివరాలను త్వరలోనే తెలి యజేస్తాం’ అని వెల్లడించారు. ఈ చిత్రానికి కెమెరామెన్: వేణు మురళీధర్ వీ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తికేయ శ్రీనివాస్.