calender_icon.png 10 March, 2025 | 4:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెయ్యి మంది డ్యాన్సర్లతో..

06-03-2025 12:00:00 AM

సాయిదుర్గతేజ్, ఐశ్వర్యలక్ష్మి జంటగా నటి స్తున్న చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కే నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘కార్నేజ్’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మూవీ టీమ్ ఇటీవలే రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం టీమ్ దినేశ్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక లావిష్ సాంగ్‌ను చిత్రీకరిస్తోంది. ఈ పాటలో వెయ్యి మంది డ్యాన్సర్లు కనిపించబోతున్నారు. ఇది రీసెంట్ టైమ్స్‌లో షూట్ చేస్తున్న అదిరిపోయే పాటల్లో ఒకటిగా నిలవనుందని చిత్రబృందం తెలిపింది. ఈ పాన్ ఇండియా మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల కానుంది.