calender_icon.png 2 February, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో..

02-02-2025 12:52:59 AM

రాజశ్యామల బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోంది ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం. వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాలిపు మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సుమంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. శనివారం బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన లుక్‌ను డైరెక్టర్ సంతోష్ సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశా రు. ఈ సినిమా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.