calender_icon.png 26 October, 2024 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవీయ బంధాల విలువ తెలిపే కథతో..

24-10-2024 12:34:23 AM

శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శృతి జయన్, ఐశ్వర్య అనిల్‌కుమార్, వైవా రాఘవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధురెడ్డి నిర్మాతలు. సినిమా ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యం లో కథానాయకులు శివకుమార్, నితిన్ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

హీరో శివ మాట్లాడుతూ..‘సత్యమే శివం’, ‘శివపుత్రుడు’ తరహాలో మంచి అనుభూతి, భావోద్వేగానికి గురిచేసే చిత్రమిది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి గొప్ప సంస్థ మా చిన్న సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తుండటం సంతోషంగా ఉందన్నారు. హీరో నితిన్ ప్రసన్న మాట్లాడుతూ.. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’లో నెగిటివ్ రోల్ చేశా. ఇందులో కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ అని అన్నారు.