calender_icon.png 12 January, 2025 | 3:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక పథకం ప్రకారం కట్టిపడేసే కథతో..

11-01-2025 12:00:00 AM

 ‘143’, ‘బంపర్ ఆఫర్’ వంటి చిత్రాలతో తనకంటూ గుర్తింపు సంపాదిచుకున్న సాయిరాం శంకర్ ప్రస్తుతం ‘ఒక పథకం ప్రకారం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ‘ఓ మంచివాడి లోపల ఒక చెడ్డవాడు ఉంటాడు.. ఓ చెడ్డవాడి లోపల చెడ్డవాడు మాత్రమే ఉంటాడు’ అనే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

క్రైం, మర్డర్ కథనాలను చూపిస్తూ హీరోనే విలనా? అనే సందేహాన్ని రేకెత్తిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రానికి వినోద్ కుమార్ విజయన్ దర్శక నిర్మాత. ఈ చిత్రంలో శ్రుతి సోధి, ఆశిమ నర్వాల్, సముద్రఖని, రవి, పచముతు, పల్లవి గౌడ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ.. “ఇదొక విభిన్నమైన కథ.

అడ్వకేట్ పాత్రలో సాయిరాం శంకర్, పోలీసు పాత్రలో సముద్రఖని నటన పోటాపోటీగా ఉంటుంది. ఊహించని మలుపులతో ఉత్కఠభరితంగా సాగే క్రైం, మిస్టరీ కథనాలతో ఆద్యంతం కట్టిపడేస్తుంది. రాహుల్ రాజ్, గోపి సుందర్ పాటలు - స్కోర్ అద్భుతంగా వచ్చాయి. చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాం” అన్నారు.