calender_icon.png 2 February, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యాపేట పరిసరాల్లో జరిగే కథతో..

02-02-2025 12:58:05 AM

‘కొత్తగా మా ప్రయాణం’ సినిమాలో హీరో గా నటించిన ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్‌కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు, నిర్మించిన ఈ సినిమాకు రాజేశ్ నాదెండ్ల దర్శకత్వం వహించారు.

ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు కథ నేనే రాశా ను. సూర్యాపేట పరిసరాల్లో జరిగే కథ.

ప్రభు త్వం నుంచి ఉచితాలు తీసుకోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుం టున్నారో తెలిపే సబ్జెక్టు ఇది. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు అదరిస్తారని ఎన్నో సార్లు రుజువైంది. అందుకే ఈ సినిమా చేశాం’ అన్నారు.

హీరోయిన్ నైనా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను జ్యోతి పాత్రలో నటించాను. యూత్‌కు బాగా నచ్చే సబ్జెక్టు ఇది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతోపాటు చిత్రబృందం పాల్గొన్నారు.