calender_icon.png 3 April, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓల్డ్‌సిటీ నేపథ్యం కథతో..

03-04-2025 12:00:00 AM

టాలీవుడ్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ సినిమాను ప్రకటించా రు. ఇది వారి విజయవంతమైన చిత్ర నిర్మాణ ప్రయాణంలో మైలురాయిగా నిలిచే ప్రాజెక్టు కావడం విశేషం. ఈ చిత్రంలో ‘రౌడీబా య్స్’, ‘లవ్ మీ’ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆశిష్ కథానా యకుడిగా నటిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌తో కొత్త దర్శకుడు ఆదిత్యరావు గంగ సానిని పరిచయం చేస్తోంది ఎస్‌వీసీ బ్యాన ర్. ఈ తాజాచిత్రం హైదరాబాద్ ఓల్డ్‌సిటీ నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో ఆశిష్ లోకల్ గయ్‌గా కనిపించనున్నారు. దీంతో ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ కానున్నాడు ఆశిష్.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి సినీప్రియుల్లో మరింత పెంచు తూ నిర్మాతలు న్యూ ట్యాలెంట్ కోసం ముఖ్యంగా హైదరాబాద్ యాసను స్పష్టంగా మాట్లాడేవారి కోసం తాజాగా కాస్టింగ్ కాల్ ను అనౌన్స్ చేశారు. ఇంకా ఈ సినిమాకు సంబధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.