calender_icon.png 26 October, 2024 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

న్యాయం కోసం పెట్రోల్ డబ్బాతో

13-08-2024 02:07:03 AM

  1. ప్రజాఫిర్యాదుల విభాగానికి వృద్ధుడు 
  2. గమనించి తీసుకున్న కలెక్టర్ గన్‌మెన్ 
  3. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగిన వృద్ధులు

మంచిర్యాల, ఆగస్టు 12 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జన్కాపూర్ గ్రామానికి చెందిన శీలం పోచయ్యకు టేకులపల్లి శివారులో మూడు ఎకరాల భూమి ఉంది. దానిని తన అన్న శీలం కిష్టయ్య కొడుకు శీలం శ్రీనివాస్ (మంచిర్యాల పంచాయతీ రాజ్ కార్యాలయ ఉద్యోగి) దొంగ పట్టా చేయించుకుని మోసం చేశాడ ని, న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్నిసార్లు వచ్చినా పట్టించుకోవడం లేదని, తనకు న్యాయం జరుగదని భావించిన పోచయ్య.. సోమవా రం ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ సెల్‌కు పెట్రోల్ డబ్బాతో వచ్చాడు.

పెట్రోల్ డబ్బాతో కూర్చున్న పోచయ్య, అతని వదిన బాయక్కను గమనించిన కలెక్టర్ గన్‌మెన్ వెంటనే అక్కడకు వెళ్లి డబ్బా తీసుకుని, కలెక్టర్ కుమార్‌దీపక్ వద్దకు తీసుకెళ్లాడు. నలుగురు అన్నదమ్ములకు చెందాల్సిన భూమిని అక్రమ పట్టా చేసుకున్నాడని, తమకు న్యాయం చేయాలని బాధితుడు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. కొద్ది రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదని, ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమని పెట్రోలు వెంట తెచ్చుకున్నామని కలెక్టర్‌కు తెలిపారు. స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. పెట్రోలు డబ్బాతో వచ్చిన విషయం తెలిసిన అధికారులు ఉలిక్కిపడ్డారు.