అల్లు అర్జున్‌కు ‘పుష్ప2’తో భారీ సక్సెస్ లభించింది. తాజాగా ఈ చిత్రంలో రీ లోడెడ్ వెర్షన్ యాడ్ చేశారు. 20 నిమిషాల కొత్త సీన్స్‌ను సినిమాకు జోడించటంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ తర్వాతి సినిమా కూడా త్వరలోనే పట్టాలపైకి రానుందని సమాచారం.
త్రివిక్రమ్‌తో ఆయన నెక్ట్స్ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాలకు ప్రేక్షకాదరణ పొందాయి. వీరి కలయికలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ చిత్రాలు రాగా మంచి విజయాన్ని నమోదు చేశాయి. దీంతో వీరి కాంబోలో వస్తున్న నాలుగో చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెలాఖరులో ఈ సినిమా ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త తాజాగా ప్రచారంలోకి వచ్చింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమా మైథలాజికల్ టచ్‌తో రానుందనేది ఈ వార్త సారాంశం.
అంతేకాకుండా ఒక చిన్న వీడియోతో ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తారని టాక్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లుక్ కూడా మునుపటి సినిమాలకు భిన్నంగా ఉంటుందని సమాచారం.