11-04-2025 12:00:00 AM
అగ్ర నటుడు చిరంజీవి నటిస్తున్న తాజాచిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం లో యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రిష, ఆషికారంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మ్యూజి క్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
కీరవాణి స్వరపరిచిన ‘రామ రామ..’ పాటను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చిరంజీవి చుట్టూ హనుమంతుడి వేషధారణలో ఉన్న పిల్లలు, బ్యాక్‌డ్రాప్‌లో రాముడి విగ్రహం ఆకట్టుకుంటోంది. ఫస్ట్ సింగిల్‌గా భక్తిగీతాన్ని విడుదల చేస్తుండటం విశేషం.