18-04-2025 12:00:00 AM
నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయరెడ్డి
తెలుగమ్మాయి అయిన సుమయరెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. సాయి రాజేశ్ మహాదేవ్ స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రచయిత, నిర్మాత, హీరోయిన్ సుమయరెడ్డి మాట్లాడుతూ.. “అనంతపూర్ నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. తెలుగమ్మాయిలు ఇప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారు. నేను ఓ అడుగు ముందుకేసి ఈ సినిమా నిర్మించా.
ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ప్రతి అమ్మాయి విజయం వెనకాల ఓ అబ్బాయి ఉంటాడు. నగేశ్ ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచీ నాతో ఉన్నారు. మీకోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు. ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను తీసుకువచ్చాను. అందరూ చూసి ఈ సినిమాను విజయవంతం చేయండి” అన్నారు. పృథ్వీ అంబర్ మాట్లాడుతూ.. ‘సుమయరెడ్డి ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది’ అని చెప్పారు.
డైరెక్టర్ సాయిరాజేశ్ మాట్లాడుతూ.. ‘మేం ఈ కథను నమ్మి చాలా మంది వద్దకు తిరిగాం. కానీ కథలో చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందుకే సుమయరెడ్డే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. మా వెనకాల ఎవ్వరూ లేదు. సమాజానికి ఈ సినిమా అవసరం ఉంది’ అని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నితిన్‌సాయి చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘మా అక్క సుమయరెడ్డి డియర్ ఉమ అనే మంచి సందేశాత్మక చిత్రాన్ని తీశారు’ అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ నగేశ్ మాట్లాడుతూ.. ‘సుమయరెడ్డి నాకు మంచి స్నేహితు రాలు. తన డ్రీమ్స్ గురించి, తన స్టోరీ గురించి ఎప్పుడూ చెప్తుండేవారు. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు’ అని చెప్పారు.
జ్యోతిరెడ్డి మాట్లాడుతూ.. “నా కూతురు సుమయ పదేళ్ల నుంచి ఎవరి కోసమో ఎదురుచూడకుండా కష్టపడి పైకి వచ్చింది’ అన్నారు. ‘అందరికీ అవగాహన కల్పించేలా ఈ చిత్రం ఉంటుంది’ అని కమెడియన్ పృథ్వీ అన్నారు. ‘ఓ మంచి సందేశాన్నివ్వాలని ఈ చిత్రాన్ని తీశారు’ అని లిరిసిస్ట్ పూర్ణాచారి’ అన్నారు.