బెంగళూరు, జూలై 19: దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన విప్రో కన్సాలిడేటెడ్ నికరలాభం జూన్‌తో ముగిసిన క్యూ1 లో 4.6 శాతం వృద్ధితో రూ. 3,003.2 కోట్ల కు చేరింది. ఆదాయం మాత్రం 3.8 శాతం క్షీణించి రూ. 21,963.8 కోట్లకు పడిపోయిం ది. 2024 సెప్టెంబర్ త్రైమాసికంలో తమ ఐటీ సర్వీసుల ఆదాయం రూ.2,600 2,652 మిలియన్ డాలర్ల మేర ఉండవచ్చని విప్రో గైడెన్స్‌లో తెలిపింది. ముగిసిన త్రైమాసికంలో 1 బిలియన్ డాలర్లను మించిన పెద్ద డీల్స్ సంపాదించామని విప్రో సీఈవో, మే నేజింగ్ డైరెక్టర్ శ్రీని పల్లియా చెప్పారు. వివి ధ పరిశ్రమలు, రంగాలవారీగా క్యూ1లో నిర్మించుకున్న మూమెంటంను క్యూ2లో మ రింత ముందుకు తీసుకెళతామని అన్నారు.