09-04-2025 01:30:19 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): జైలు నుంచి బయటకు వచ్చాక బీఆర్‌ఎస్‌లో తన స్థానం కోసం కల్వకుంట్ల కవిత అనేక విన్యాసాలు చేస్తున్నారని, లిక్కర్ మరకలను తుడిచివేసుకోవడానికి నానాపాట్లు పడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.
బీసీ రిజర్వేషన్లు, జ్యోతిరావు ఫూలే విగ్రహం పేరిట కవిత డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా తో మాట్లాడు తూ.. దేశంలో లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన మొదటి మహిళా నాయకురాలు కవిత అని, దాదాపు ఆరు నెలలు లిక్కర్ కేసులో జైలు లో ఉండి వచ్చిన నాయకురాలని ఎద్దే వా చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఫూలే ఎం దుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. బీసీల కోసం మాట్లాడే అర్హత కవితకు లేదని, కవితకు బీసీల మీద ప్రేమ ఉంటే తెలంగాణ జాగృతి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని బీసీ నేతకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.