calender_icon.png 6 November, 2024 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 నుంచి శీతాకాల సమావేశాలు

06-11-2024 01:33:32 AM

న్యూఢిల్లీ, నవంబర్ 5: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25న ప్రారం భం కానున్నాయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. మంగళ వారం ఎక్స్ వేదికగా సమావేశాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నవబంర్ 26(రాజ్యాంగ దినోత్సవం)న రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తవనున్న సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, జార్ఘండ్ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టిసారించాయి.

వీటికి సంబంధించి నవంబర్ 23న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ తర్వాతనే శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఈ సెషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వక్ఫ్ బిల్లుకు సవరణలు, జమిలి ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించి నిబంధనల బిల్లులపై ఈ సమావేశంలో చ ర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.