calender_icon.png 25 November, 2024 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

25-11-2024 03:02:03 AM

  1. వాడీవేడిగా సాగిన అఖిలపక్ష సమావేశం
  2. మణిపూర్, అదానీ అంశాలపై చర్చించాలని విపక్షాల డిమాండ్

న్యూఢిల్లీ, నవంబర్ 24: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు, జమిలీ ఎన్నికలతో పాటు మరో 16 బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జాబితా సిద్ధం చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌లోని హౌస్ అనెక్స్ ప్రధాన కమిటీ రూమ్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది.

ఈ సమావే శంలో మణిపూర్ హింస, అదానీపై కేసు తదితర అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ కోరింది. కాగా పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. రాజ్యా ంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న సమావేశాల జరగవని,  ఆ రోజున సంవిధాన్ భవన్ (పాత పార్లమెంట్)లో వేడుకలు నిర్వహించనున్నారు. 

5 కొత్త బిల్లులు

కేంద్రం తీసుకురాబోయే 16 బిల్లుల్లో 5 కొత్తవి కాగా మరో 11 బిల్లులను పరిశీలన చేసి ఆమోదించాల్సి ఉంది. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంట్ సంయుక్త కమిటీ ఈ నెల 29న తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. కానీ, విపక్షాలు మాత్రం ప్యానెల్‌కు మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నాయి. వక్ఫ్ యాక్ట్‌కు అనుబంధంగా ఉన్న ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు రానుంది.