30-03-2025 05:26:49 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని సింగరేణి కేకే 1 డిస్పెన్సరీ సమీపంలో రూరల్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆదివారం అసోసియేషన్ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ... వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మండలంలోని మారుమూల గ్రామాల నుండి మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రయాణికులు వేసవిలో త్రాగునీటి కోసం ఇబ్బందులు పడే వారని వారి ఇబ్బందులు తీర్చేందుకు రూరల్ ఆటో స్టాండ్ లో ఆటో డ్రైవర్స్, ఓనర్స్ ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండల, పట్టణ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటో డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు దుర్గం సుధాకర్, అత్తి మల్లేష్, నల్లూరి మల్లేష్, మహేష్, రాజన్న, సత్తన్న, గంగారం, అశోక్, శ్యామ్, నర్సింగ్, నైతం శ్రీనివాస్, సాగర్, బాలు, మల్లేష్, శ్రీనివాస్, రామారావులు పాల్గొన్నారు.