15-04-2025 08:05:07 PM
టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని బస్టాండ్ సెంటర్లో మంగళవారం పిండిపోలు రామమ్య సేవసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్ మహేందర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... వేసవి కాలంలో బాగా రద్దీ ఉన్న ప్రదేశాలలో ఇలా చలివేంద్రం ఏర్పాటు చేయడం, సేవ చేయడం దాహర్చి తీర్చుట చాలా మంచి శుభ పరిణామం అని అన్నారు.
పిండిపోలు రామయ్య సేవాసంస్థ గౌరవ అధ్యక్షులు అయిన పిండిపోలు బుజ్జికన్నయ్యని ఆయన అభినందించారు. ఒక సేవాసంస్థను నడుపుతూ, విద్యుత్ శాఖలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తండ్రి పేరు మీద ఇలా సేవా కార్యాక్రమాలు చెయ్యాలని, ముందుకు సాగాలని కోరారు. బుజ్జి కన్నయ్య మాట్లాడుతూ... తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం గత 25 సంవత్సరాల నుండి సేవా కార్యాక్రమాలు చేస్తున్నానన్నారు. ఈ కార్యాక్రమంలో ఏడిఈ హేమచంద్ర బాబు, బొమ్మన పల్లి విద్యుత్ సిబ్బంది దేవ్ సింగ్, నాగుల్ మీర, చరత్, వసీమ్, యాకూబ్, ప్రవర్ణనకుమార్, లచ్చు, శ్రీనివాసచారి, షకీల్, బొమ్మనపల్లి గ్రామస్తులు మంగ్యాతండా మాజీ సర్పంచ్ పూల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.