calender_icon.png 31 October, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలైవాస్, హర్యానాకు విజయాలు

31-10-2024 12:42:56 AM

పీకేఎల్ 11వ సీజన్

హైదరాబాద్: ప్రొకబడ్డీ లీగ్ 11వ సీజన్లో బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్, హర్యానా స్టీలర్స్ విజయం సాధించాయి. తమిళ్ జట్టు 25-44 తేడాతో  గుజరాత్‌ను మట్టికరిపించింది. అమీర్, నితేశ్ కూడా డిఫెండింగ్‌లో రాణించారు. దీంతో గుజరాత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తమిళ్ తలైవాస్ ముందు తేలిపోయింది.

గుజరాత్ జట్టులో గుమన్ సింగ్ (7) టాప్ స్కోరర్. ఫస్టాఫ్‌లో ఆలౌట్ కాకుండా జాగ్రత్తగా ఆడిన గుజరాత్ రెండో హాఫ్‌లో మాత్రం రెండు సార్లు ఆలౌట్ అయింది. తమిళ్ తలైవాస్‌కు, గుజరాత్ జెయింట్స్‌కు చెరి మూడు అదనపు పాయింట్లు లభించాయి. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 30-28 తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది.

హర్యానాలో వినయ్ 8, శివమ్ పాత్రే 5 రెయిడ్ పాయింట్లు సాధించారు. యూపీలో సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన గగన్ గౌడ 9 రెయిడ్ పాయింట్లతో తృటిలో సూపర్ టెన్ చేజార్చుకున్నాడు. యూపీ కెప్టెన్ సురేందర్ గిల్ కేవలం ఒకే ఒక్క రెయిడ్ పాయింట్ సాధించి మధ్యలోనే బయటకు వెళ్లాడు.

హర్యానా కెప్టెన్ జయదీప్ కూడా ఒకే ఒక్క పాయింట్ సాధించాడు. అయినా కానీ హర్యానా మాత్రం యూపీకి షాక్ ఇచ్చింది. నేటి విజయంతో తమిళ్ తలైవాస్ మొదటి స్థానానికి చేరుకుంది. తెలుగు టైటాన్స్ రెండు విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.