02-04-2025 11:44:53 PM
బ్యాడ్మింటన్ మాజీ కోచ్ భాస్కర్ బాబు..
హైదరాబాద్ (విజయక్రాంతి): క్రీడాకారుల గెలుపు ఓటములు క్రీడా స్ఫూర్తితో తీసుకున్నప్పుడే క్రీడల్లో రాణిస్తారని మాజీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ భాస్కర్ బాబు పేర్కొన్నారు. అకాడమీ నిర్వాహకులు పిల్లలమర్రి రమేశ్, రఘు ఆధ్వర్యంలో బుధవారం నాగోల్‌లోని భాస్కర్ బాబు ఆర్‌త్రి బ్యాడ్మింటన్ అకాడమీని భాస్కర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపు ఓటములు సమానంగా తీసుకున్నప్పుడే వారు మరింతగా క్రీడల్లో రాణిస్తారని అన్నారు. అలాగే క్రీడలతో పాటు చదువులో రాణించినప్పుడు ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. ఈ కంప్యూటర్ యుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలని సెల్‌ఫోన్లకు అంకితం కాకుండా క్రీడా మైదానానికి ఉదయం, సాయంత్రం పంపుతూ ఇష్టమైన క్రీడల్లో తప్పనిసరి పాల్గొనేలా చూస్తు తమ పిల్లలు ఆరోగ్యవంతులుగా రాణిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.