సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్
మందమర్రి (విజయక్రాంతి): క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓటమితో కుంగిపోకుండా భవిష్యత్తు విజయాల కోసం సరైన ప్రణాళికలు రచించి క్రీడల్లో మెలుకువలు పాటిస్తూ విజయాలు సాధించాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జి.దేవేందర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో డబ్లుపిఎస్ జిఏ ఆధ్వర్యంలో, రెండు రోజుల పాటు నిర్వహించనున్న కంపెనీ స్థాయి ఫుట్ బాల్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆటల ద్వారా మానసిక శారీరక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వం కలుగుతుందని ప్రతి ఒక్కరు తమకు నచ్చిన క్రీడల్లో రాణించాలని సూచించారు.
క్రీడాకారులు అందరూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా భావించాలని అన్నారు. కంపెనీ స్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు కోల్ ఇండియా పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రెండు రోజులపాటు జరగనున్న పోటీలలో పోటీలలో గెలుపొందిన వారికి చివరిరోజు ఈనెల 6న బహుమతి ప్రధానము చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రెటరీ సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఎఐ అధికారి పైడీశ్వర్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, స్పోర్ట్స్ సమన్వయకర్త సీనియర్ పిఓ ఎం కార్తీక్, స్పోర్ట్స్ సూపర్వైజర్ కార్పొరేట్ పాస్నెట్, స్పోర్ట్స్ సూపర్వైజర్లు జాన్ వెస్లీ, సిహెచ్ అశోక్, హెచ్ రమేష్, పి శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఎస్ శివకృష్ణ, జనరల్ క్యాప్టన్ సాక శ్రీనివాస్, అన్ని ఏరియాల క్రీడాకారులు, అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.