calender_icon.png 30 April, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల్లో గెలుపోటములు సహజం

30-04-2025 12:00:00 AM

- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 

 రాజేంద్రనగర్, ఏప్రిల్ 29: క్రీడల్లో గెలుపోటములు సహజమని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలియజేశారు. అందరూ క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని విజయ ఆనంద్ గార్డెన్లో మంగళవారం రాజేంద్రనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ, బీ, సీ, డీ జట్లు తలపడ్డాయి. మొదట బి, డి జట్ల సభ్యులు ఆడారు. ఆ తర్వాత ఏ, సి జట్లు ఆడాయి. ఫైనల్ మ్యాచ్లో బి, డి జ ట్లు సమానమైన స్కోర్ చేయడంతో డ్రా గా ముగిసింది. మ్యాన్ ఆఫ్ ది సీరియస్ గా ఆమెర్, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా సూర్యకిరణ్ నిలిచారు. బెస్ట్ బ్యాట్స్మెన్ గా రాజేష్ ప్రతిభ కనబరిచారు.

క్రీడాకారుల కుటుంబ సభ్యులకు వివిధ పోటీలు నిర్వహించారు. అనంతరం టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ట్రోఫీలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతినిత్యం జర్నలిస్టులు తమ వృత్తిలో బిజీగా ఉంటారని, క్రీడా పోటీలకు సమయం వెచ్చించి ఆడడం ఎంతో అభినందనీయమని ఆయన కొనియాడారు. క్రీడలతో మానసికోలాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు సూర్యనారాయణ, వెంకటేష్, వెంకటేష్, సూర్య కిరణ్, సుజీవన్ రెడ్డి, తిరుమలేష్, లక్ష్మణ్, రాము యాదవ్, కోస్గి నరసింహ, నగేష్, సత్యం గౌడ్, విజయ్, బాల మురళీకృష్ణ, నర్సింలు, దస్తగిరి, ప్రశాంత్ రె డ్డి, మహేందర్ రెడ్డి, రామ కృష్ణ రవికుమార్, శివ, రాజేష్, నరేందర్, రాజు పాల్గొన్నారు.