పెద్దపల్లి, జనవరి 15: క్రీడల్లో గెలుపు ఓట ములు సహజమని...గ్రామీణ క్రీడలను ప్రో త్సహించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుం ట విజయరామరావు అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి మం డలం కాపులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మ్యాదరవేణి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో రెండు రోజు లుగా నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్స్ బుధవా రం సాయంత్రం ముగిసాయి. ఇందులో విజేతలైన వారికి స్థానిక నాయకులతో కలిసి బహుమతులను ఎమ్మెల్యే అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడల్లో ఓడినా గెలిచినా నైపుణ్యం అభివద్ధి చెందు తుందన్నారు. క్రీడ లు మానసిక ఉల్లాసానికి, దేహదారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడ తయన్నారు. సంక్రాంతి పండుగ సందర్భం గా గ్రామీణ క్రీడ అయినటువంటి కబడ్డీ టోర్నమెంట్స్ నిర్వహించడం అభినందనీ యమన్నారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలు క్రమశిక్షణకు దోహదపడ తాయన్నారు. ఈ టోర్నమెంట్స్‌ను స్ఫూర్తిగా తీసుకొని అన్ని గ్రామాల్లో ఇలాంటి గ్రామీణ క్రీడలు నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు.
గెలిచిన వెంకట్రావుపల్లి జట్టుకు రూ. ౧౦ వేల నగదు బహుమతిని, రన్నర్‌గా నిలిచిన కాపులపల్లి జట్టుకు రూ. 5 వేలు, షీల్డ్‌లను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు మల్లేష్యాద వ్, మాజీ ఎంపిటి సి ఎడెల్లి శంకర్, యూత్ కాంగ్రెస్ నియోజ కవర్గ అధ్యక్షుడు నరేష్, యూత్ మండల అధ్యక్షుడు రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు సాయి, సుకన్య, గాజుల ప్రవీణ్, నల్లపు తిరుపతి, పిట్టల స్వామి, పలువురు పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.