calender_icon.png 14 April, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజం

08-04-2025 12:28:39 AM

బీజేపీ ఇంచార్జ్ సుదర్శన్‌రెడ్డి 

మేడ్చల్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): క్రీడా పోటీలలో గెలుపు, ఓటమి సహజమని, ఓటమితో కుంగిపోవద్దని బిజెపి మే డ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఘట్కేసర్ మండలంలో ని మాదారం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన జట్లకు ఆయ న బహుమతులు ప్రధానం చేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి  గెలుపునకు నాంది అవుతుందన్నారు.

విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సచిన్ టెండూల్కర్ పదవ తరగతి కూడా పాస్ కాకుండా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అగ్ర క్రికెటర్ గా ఎదిగారన్నారు. మాదారం గ్రామం తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.