09-03-2025 10:52:49 PM
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె గోపాల్ గౌడ్...
ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె గోపాల్ గౌడ్ అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె గోపాల్ గౌడ్ తన తండ్రి కీ.శే.సదర్శన్ గౌడ్ జ్ఞాపకర్థంగా గత 45 రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ సీజన్-8 ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆదిబట్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మర్రి నిరంజాన్ రెడ్డి హాజరై గెలుపొందిన విజేతలకు బాహుమతులు అందజేశారు. ఇందులో 10జట్లు పాల్గొన్నగా, మొదటి బహుమతి మహాత్మ యూత్ అసోసియేషన్ రూ.46 వేలు, రెండో బాహుమతి యువ చైత్యన్య యూత్ అసోసియేషన్ రూ.28 వేల బహుమతి అందుకున్నారు.
ఈ సందర్భంగా పల్లె గోపాల్ గౌడ్ మాట్లాడుతూ.. యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి. యువత తలుచుకుంటే ఏదైనా సాధించే ఆత్మవిశ్వాసం వారి సొంతం అవుతుందనన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఏస్ సీనియర్ నాయకులు కోరె జంగయ్య, రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రజిని కాంత్, పాండు రంగారెడ్డి, రవి గ్రామ పెద్దలు,రవి గౌడ్,యువకులు ప్రవీణ్ గౌడ్, మల్లేష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.