calender_icon.png 9 January, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజేతలు నిదీశ్, కియాన్నా

03-01-2025 12:00:00 AM

పుణే: 37వ జాతీయ అండర్ చెస్ చాంపియన్‌షిప్ విజేతలుగా నిదీశ్ శ్యామల్, కియాన్నా పరిహార్ నిలిచారు. గురువారం జరిగిన చివరి రౌండ్‌లో ఓపెన్ సెక్షన్ కేటగిరీలో నిదీశ్  పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒషిక్ మొండల్‌పై 63 ఎత్తుల్లో విజయం సాధించి 9.5 పాయింట్లతో టాప్‌లో నిలిచి టైటిల్ అందుకున్నాడు. ఇక బాలికల కేటగిరీలో కియాన్నా గుజరాత్‌కు చెందిన అశ్వి సింగ్‌ను 66 ఎత్తుల్లో ఓడించి 10 పాయింట్లతో ట్రోఫీని అందకుంది. నిదీశ్, కియాన్నాలకు రూ.50వేల ప్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్‌లకు ఆరిత్ కపిల్, దివి బిజేశ్‌లకు చెరో 36వేలు గెలుచుకున్నారు.