calender_icon.png 26 December, 2024 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజేతలు నవ్యశ్రీ, రాజు సింగ్

26-12-2024 12:23:21 AM

న్యూఢిల్లీ: జూనియర్ నేషనల్ ఈక్వేస్ట్రియన్ చాంపియన్‌షిప్ ఫస్ట్ హాఫ్ పోటీల్లో యువ రైడర్లు అనుపతి నవ్యశ్రీ, రాజుసింగ్ విజేతలుగా నిలిచారు. యంగ్ రైడర్ కేటగిరీలో నవ్యశ్రీ 32.60 పాయింట్లు స్కోరు చేసి తొలి స్థానంలో నిలిచింది. నవ్యశ్రీ తర్వాతి స్థానాల్లో అవిక్ భాటియా, గీతిక టిక్కిషెట్టి, మోను కుమార్‌లు ఉన్నారు. ఇక డ్రెస్సేజ్ ఫ్రీస్టుల్‌లో  రాజు సింగ్ 65.18 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. జవీర్ వర్మ, గీతిక, నవ్యశ్రీ మంచి పోటీ ఇచ్చారు. పిల్లల డ్రెస్సేజ్ కేటగిరీలో సుభ్ చౌదరీ విజేతగా నిలవగా.. ప్రణవ్ దీపక్, పున్నీత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టోర్నీలో రెండో దశ పోటీలు శుక్రవారం నుంచి మొదలుకానున్నాయి.