calender_icon.png 17 January, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజేతలు భవ్య, శార్దూల్

17-01-2025 12:00:00 AM

న్యూఢిల్లీ: జాతీయ షూటింగ్ చాంపియన్‌లో మహిళల, పురుషుల షూటింగ్ ట్రాప్ ఈవెంట్‌లో భవ్య త్రిపాఠి, శార్దూల్ విహాన్ విజేతలుగా నిలిచారు. గురువారం ఢిల్లీలోని కర్ణీసింగ్ స్టేడియంలో జరిగిన మహిళల ట్రాప్ ఈవెంట్‌లో భవ్య 9 సబీరా హారిస్‌పై విజయం సాధించింది.

పురుషుల ట్రాప్ ఈవెంట్ ఫైనల్లో శార్దూల్ 45 పా యింట్లు స్కోరు చేసి స్వర్ణం గెలవగా.. హర్యానాకు చెందిన లక్ష్యయ్ షెరాన్ రజతం సొం తం చేసుకున్నాడు. ఇక ఒలింపియన్ పృథ్వీరాజ్ తొండైమన్ కాంస్యంతో సరిపెట్టు కు న్నాడు. మహిళల జూనియర్ ట్రాప్ ఈవెంట్‌లో శ్రేష్ఠ , సబీరా స్వర్ణ, రజతాలు గెలుచు కోగా.. పురుషుల జూనియర్ విభాగంలో వినయ్ ప్రతాప్ స్వర్ణం గెలుచుకున్నాడు.