న్యూఢిల్లీ: ఐటీఎఫ్ జె-300 టెన్నిస్ టోర్నీ విజేతగా భారత్‌కు చెందిన మాయా రేవతి రాజేశ్వరన్ నిలిచింది. శనివారం డీఎల్‌టీఏ కాం ప్లెక్స్ వేదికగా జరిగిన బాలికల సింగి ల్స్ ఫైనల్లో 15 ఏళ్ల రేవతి 3-6, 7- 5, 6-2తో రష్యాకు చెందిన ఎకాటెరీనాను చిత్తు చేసింది. డిసెంబర్ 2023 తర్వాత రేవతి సింగిల్స్‌లో టైటిల్ గెలవడం మళ్లీ ఇదే కావడం విశేషం.బాలుర సింగిల్స్ విజేతగా కొరియాకు చెం దిన డొంగ్‌యోన్ హాంగ్ నిలిచాడు.