06-03-2025 01:23:15 AM
వీడిన ఉత్కంఠ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మరో విజయం
కరీంనగర్, మార్చి 5 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ఒక ఉపా ధ్యాయ స్థానాన్ని దక్కించుకున్న బీజేపీకి మరో విజయం. కరీంనగర్--మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి చెన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు.
సోమవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు బుధ వారం రాత్రి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగింది. రెండవ ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. నిర్ధారిత కోటా ఓట్లు 1,16,672 కాగా రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్త య్యే సరికి కూడా నిర్ధారిత కోటా ఎవరికి రాలేదు. దీంతో మెజార్టీ ఓట్లు సాధించిన అంజిరెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 9:30 గంటల వరకు కొనసాగింది. మొత్తం 11 రౌండ్లలో ఈ లెక్కింపు సాగింది. మొత్తం బ్యాలెట్ పేపర్లు 2,52,029 కాగా ఇందులో 28,686 ఓట్లు చెల్లలేదు. మొత్తం 2,23,340 ఓట్లను లెక్కించారు. మొదటి ప్రాధాన్యతలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675, కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికి 70,565, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,149 ఓట్లు లభించాయి.
నిర్ధారిత కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించి రెండవ ప్రాధా న్యత ఓట్ల లెక్కింపును జరిపారు. 52వ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి 77,851, కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికి 72,038, బీఎస్పీ అభ్యర్థి ప్రస న్న హరికృష్ణకు 63,679 ఓట్లు లభించాయి.
53, 54లో యాదగిరి శేఖర్రావు, ప్రసన్న హరికృష్ణలు ఎలిమినేట్ కాగా వీరి రెండవ ప్రాధా న్యత ఓట్ల లెక్కింపు అనంతరం బీజేపీ అభ్యర్థికి అంజిరెడ్డికి 98,637, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 93,531ఓట్లు లభించాయి. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం 5106 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు.
మా బాధ్యతను మరింత పెంచింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో మూడు ఎమ్మె ల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకోవ డం పార్టీ బలాన్ని, ప్రజా దరణను మరోసారి స్పష్టంగా చాటిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ర్టంలో ఏ ఎన్నికలు జరిగినా.. మేధావులు మొదలుకుని అన్ని వర్గాల ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని అన్నారు.
తెలంగాణలో బీజేపీ ఓ ప్రత్యా మ్నాయ శక్తిగా ఎదిగిందనడానికి ఈ విజయం ఒక నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. రాష్ర్టంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనేక కుట్రలు, అసత్య ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నం చేసినా ప్రజలు బీజేపీ వెంటే నిలబడ్డారని తెలిపారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండు చోట్ల బీజేపీ గెలవడం, మరోచోట ఉపాధ్యాయ సంఘం విజయం సాధించడం..
ప్రభు త్వం పట్ల పెరుగుతున్న అసహనానికి, బీజేపీ పట్ల పెరుగుతున్న ఆదరణకు ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ విజయాన్ని అం దించిన తెలంగాణ మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభ ద్రులందరికీ, ఈ విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయంతో పాటు ఉపాధ్యా య ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలుపు తమ పార్టీకి గర్వకారణంగా ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మల్క కొమురయ్యను గెలిపిస్తే, పట్టభద్రులు చిన్నమైల్ అంజిరెడ్డిని విజయతీరాలకు చేర్చారని.. కాంగ్రెస్ సిట్టింగ్ సీటులో విజయం సాధించడం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు పోరాటం చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ ఛాంపియన్ ట్రోఫీ విజేత బీజేపీ
కరీంనగర్: తెలంగాణలో జరిగిన ఎమ్మె ల్సీ ఎన్నికల ‘ఛాంపియన్ ట్రోఫీ’లో బీజేపీ విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు గుణపాఠమన్నారు. ముస్లింలంతా ఏకమై బీజేపీని ఓడించాలని చూస్తే హిం దూ సమాజమంతా కాంగ్రెస్‌ను ఓడించి ఆ పార్టీకి ‘రంజాన్’ గిఫ్ట్ ఇచ్చారని పేర్కొన్నా రు.
బీజేపీ కార్యకర్తల పోరాటాలకు హ్యాట్సాఫ్ చెప్పిన బండి సంజయ్ బీజేపీకి అండగా నిలిచిన ఓటరు మహాశయులకు శిరస్సు వంచి వందనాలు తెలిపారు. డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ అభ్యర్ధి చెంప చెళ్లుమన్పించారని చెప్పారు. నోట్లు పంచిన వారిని వదిలిపెట్టబోమని, గూగు ల్ పే వివరాల లెక్కలు తీస్తున్నామని తెలిపారు.
కరీంనగర్- ఆదిలా బాద్- గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి చిన్నమైల్ అంజిరెడ్డి విజ యం సాధించిన అనంతరం మాజీ ఎమ్మె ల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్ సునీల్ రావు తదితరులతో కలిసి బండి సంజయ్ ‘విక్టరీ’ గుర్తును చూపిస్తూ సంబురాలు జరుపుకున్నారు.