calender_icon.png 24 December, 2024 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండ్రోజులు వైన్‌షాప్‌లు బంద్

13-09-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి) : వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని మద్యం షాపులు(బార్లు, వైన్స్‌లు, కల్లు కంపౌడ్) బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్టార్ హాటల్‌లోని బార్‌లు, రిజిస్టర్ క్లబ్‌లకు ఈ రూల్ వర్తించదని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.