05-04-2025 02:43:28 PM
హైదరాబాద్: మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రేపు మందు తాగాలనుకునే మద్యం ప్రియులకు చుక్క దొరకదని పోలీసులు ప్రకటించారు. శ్రీరామ నవమి పండుగ(Sri Rama Navami festival) సందర్భంగా ఏప్రిల్ 6న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్‌లు మినహా వైన్ షాపులు(Wine shops), కల్లు కాంపౌండ్‌లు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు మూసివేయబడతాయని సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) శనివారం తెలియజేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రజా శాంతి, ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి(Avinash Mohanty) ఈ విషయంలో నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు ప్రాంతాల్లో శోభ యాత్రలు కూడా నిర్వహిస్తారు.