హైదరాబాద్ : రేపు జరుగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో 12 గంటలపాటు హైదరాబాద్ పరిధిలో వైన్ షాపులు బంద్ చేస్తున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ కోత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు (48 గంటలు) మద్యం అమ్మకాలపై మొదట నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 12 గంటలు పోడిగిస్తూ.. 13వ తేదీ 6గంటల నుండి 14వ తేదీ 6గంటల వరకు మధ్యం అమ్మకాలపై నిషేధం కోనసాగుతుందని సీటీ కమిషనర్ మరో ఉత్తర్వును జారీ చేశారు.