calender_icon.png 28 October, 2024 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో వైన్ షాప్ దగ్ధం

28-10-2024 11:12:16 AM

భారీగా ఆస్తి నష్టం..

జహీరాబాద్(విజయక్రాంతి): మొడంపల్లిలో ఉన్న వైన్ షాప్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధం కావడం జరిగింది. ఆదివారం రాత్రి మండల కేంద్రమైన మొగుడంపల్లిలో ఉన్న వైన్ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడం జరిగింది. భారీగా మంటలు వ్యాపించి పొగరావడంతో చుట్టుపక్కల వారు గమనించి వైన్ షాప్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే వైన్ షాప్ పూర్తిగా దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వైన్ షాప్ లో ఉన్న మద్యం సీసాలు పూర్తిగా కాలిపోవడం జరిగింది. మద్యం విలువ చేసేందుకు ఉంచిన ఫ్రీజ్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. షార్ట్ సర్కిల్ తో కాలిపోయిందా ఎవరైనా కాలపెట్టారా అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.