calender_icon.png 25 December, 2024 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన

16-10-2024 03:04:34 PM

అమరావతి,(విజయక్రాంతి): నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. చెన్నైకి 320 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 350 కిలో మీటర్లు, నెల్లూరుకు 400 కిలో మీటర్ల  దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. వాయవ్య దిశలో 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వాయుగుండం రేపు తెల్లవారుజామున తీరం దాటనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.

చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్లోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతున్నారు.  ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పెన్నా నది పరీవాహక ప్రాంతాల ప్రజలలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, జిల్లా యంత్రాంగానికి తీవ్రతకు అనుగుణంగా సూచనలు చేశారు. ఇప్పటికే సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి చొప్పున జిల్లాలకు అత్యవసర నిధులు విడుదల చేసింది. నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి.  అవసరమైన చోట 15 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. సముద్రం వేటకు వెళ్లిన 61,756 మందిని వెనక్కి రప్పించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.