ట్రినిడాడ్: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను విండీస్ జట్టు మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. సోమవారం ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో విజయాన్ని అందు కుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఓపెనర్ షెయ్ హోప్ (22 బంతుల్లో 41) టాప్ స్కోరర్. విలియమ్స్ 3 వికెట్లు తీశాడు. క్రుగర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌట్ అయింది.