calender_icon.png 24 December, 2024 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లా చేతిలో విండీస్ వైట్‌వాష్

20-12-2024 11:00:17 PM

టీ20 సిరీస్... 

సెంట్ విన్సెంట్: సొంతగడ్డపై వెస్టిండీస్‌కు పర్యాటక జట్టు బంగ్లాదేశ్ గట్టి షాక్ ఇచ్చింది. వన్డే సిరీస్‌లో బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు వచ్చేసరికి బంగ్లా చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. శుక్రవారం జరిగిన చివరి టీ20లో బంగ్లాదేశ్ 80 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3 కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. జాకర్ అలీ (41 బంతుల్లో 72 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగగా.. పర్వేజ్ హొసెన్ (39), మెహదీ హసన్ (29) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో షెపర్డ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బంగ్లా బౌలర్ల ధాటికి 16.4 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. షెపర్డ్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిషద్ హొసెన్ 3 వికెట్లు తీయగా.. మెహదీ హసన్, తస్కిన్ అహ్మద్‌లు చెరో 2 వికెట్లు తీశారు. జాకర్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, మెహదీ హసన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.