calender_icon.png 26 December, 2024 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విండీస్ అలవోకగా

11-10-2024 01:28:29 AM

మహిళల టీ20 ప్రపంచకప్

షార్జా: ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ రెండో విజయాన్ని అందుకుంది. గురువారం గ్రూప్-బిలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 0 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.

కెప్టెన్ నిగర్ సుల్తానా (39) టాప్ స్కోరర్‌గా నిలిచింది. విండీస్ బౌలర్లలో కరీష్మా రమ్‌హరాక్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్ 12.5  ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి గెలుపు రుచి చూసింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచింది. పాక్ బౌలర్లలో నిదా, మరుఫా చెరో వికెట్ తీశారు.