calender_icon.png 22 December, 2024 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో విండీస్

16-10-2024 12:27:47 AM

దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది. మంగళవారం గ్రూప్-బిలో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. నట్ సివర్ బ్రంట్ (57) టాప్ స్కోరర్. అనంతరం లక్ష్య ఛేదనలో విండీస్ 18 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (50), కియానా జోసెఫ్ (52) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో నట్ సివర్, సారా గ్లెన్ చెరొక వికెట్ తీశారు. ఇదే గ్రూప్ నుంచి సౌతాఫ్రికా సెమీస్ చేరుకుంది.