calender_icon.png 25 October, 2024 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రూడాయిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు

03-07-2024 02:21:59 AM

న్యూఢిల్లీ, జూలై 2: దేశీయంగా ఉత్పత్తయ్యే క్రూడాయిల్‌పై కేంద్రం విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను పెంచింది. ప్రస్తుతం టన్నుకు రూ. 3,250 ఉన్న పన్నును రూ. 6,000కు పెంచినట్టు ప్రభుత్వ నోటిఫికేషన్ తెలిపింది. ఈ పెంపు మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ముడిచమురు ఉత్పత్తి, పెట్రోల్,డీజిల్, ఏటీఎఫ్‌ల ఎగుమతులు ద్వారా ఆయా కంపెనీలు ఆర్జించే భారీ లాభాల్లో కొంత శాతం  ప్రత్యేక అదనపు ఎక్సయిజు సుంకం రూపంలో పన్ను విధించే విధానాన్ని 2022 జనవరిలో కేం ద్రం ప్రవేశపెట్టింది. ఆయా ఉత్పత్తుల అంతర్జాతీయ ధరల్లో 15 రోజు ల సగటు మార్పులకు అనుగుణం గా ప్రతీ పక్షం రోజులకోసారి సవరిస్తుంది. తాజాగా డీజిల్, పెట్రోల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై ఈ సుంకాన్ని ‘జీరో’గా అట్టిపెట్టింది.