calender_icon.png 23 February, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిపిటిఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్ ను కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించండి

19-02-2025 06:36:22 PM

టిఎస్యుటిఎఫ్...

బెల్లంపల్లి (విజయక్రాంతి): టీఎస్యుటిఎఫ్ బలపరిచిన టిపిటిఎఫ్ అభ్యర్థి వై. అశోక్ కుమార్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించాలని టీఎస్యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజా వేణు లు కోరారు. బుధవారం వారు బెల్లంపల్లిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ధన రాజకీయాలను ఓడించి, ప్రశ్నించే గొంతుకను గెలిపించుకొని ప్రజాస్వామ్యంలో విద్య వ్యవస్థను కాపాడాలన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయ వర్గానికి సంబంధించినవని కానీ ఎమ్మెల్సీ పదవులను రియల్ ఎస్టేట్ వర్గాలను కాపాడుకోవడానికి, కార్పొరేట్ వ్యవస్థలను సృష్టించుకోడానికి పూనుకున్న వ్యక్తులు రాజకీయ వ్యవస్థలోకి వస్తున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తులను ఎన్నుకున్నట్లయితే ఉపాధ్యాయల హక్కులను కాలరాసినట్లు అవుతుందన్నారు. ఉపాధ్యాయులు ఒక విజ్ఞతతో ఆలోచించి తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రొఫెసర్ కోదండరాంతో కలిసి ఉద్యమాన్ని నిర్మించిన విద్యావేత్త వై. అశోక్ కుమార్ గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈ. రవికుమార్, మండల ప్రధాన కార్యదర్శి టి .రమేష్ లు పాల్గొన్నారు.