calender_icon.png 22 February, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నించే గొంతుక ప్రసన్నను ఎమ్మెల్సీగా గెలిపించండి

21-02-2025 05:10:33 PM

మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప... 

పెంచికలపేట్ లో యువకులతో కలిసి ప్రచారం... 

కాగజ్ నగర్ (విజయక్రాంతి): రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపునిచ్చారు. శుక్రవారం ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున ప్రచారంలో భాగంగా పెంచికలపేట్ మండలంలో యువకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.

కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వైకరితో విముకతతో ఉన్న కోనేరు కోనప్ప పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. తమకు పార్టీలో సముచిత స్థానం లభించడం లేదని భావించిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్వతంత్ర బావుటా ఎగురవేశారు. యువకులతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పార్టీలకతీతంగా హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభధ్రులకు పిలుపునిచ్చారు.