25-02-2025 06:26:30 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ మంగళవారం ఖానాపూర్ మున్సిపాలిటీ ఇందిరానగర్ కాలనీలో మాజీ కౌన్సిలర్ పరిమి లతా సురేష్ కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగులకు, రైతులకు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని అభ్యర్థించారు.