25-02-2025 07:12:16 PM
ఉమ్మడి జిల్లా ఇన్చార్జి గోపగాని శంకర్రావు...
చర్ల (విజయకాంతి): మండల వ్యాప్తంగా టీజేఎస్ పార్టీ విస్తృత ప్రచారం ప్రారంభించింది, గోపగాని శంకర్రావు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రచారం కొనసాగించారు. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆశ్రమ పాఠశాల, కేజీబీవీ పాఠశాలను సందర్శించి ఎమ్మెల్సీ టీచర్స్ ఓటును తెలంగాణ జన సమితి అభ్యర్థి పొన్నాల గోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా గోపగాని మాట్లాడుతూ... టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంతో సహా జూనియర్ గా అడుగులు వేసిన వ్యక్తిగా ఉండి, డిగ్రీ అధ్యాపకులు, పాలిటెక్నిక్ అధ్యాపకులు, గురుకుల సొసైటీ, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ప్రగతిశీల ప్రజాస్వామ్య ఉపాధ్యాయులు బలపరిచిన ఉపాధ్యాయ ఉద్యమ సేవకుడు పన్నాల గోపాల్ రెడ్డిని వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది.
ఉపాధ్యాయులు విద్యావంతులు మేధావులు టీజేఎస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తూ సమాజ హితం కోరే తెలంగాణ జన సమితి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ అంటూ ఈ సందర్భంగా గోపగాని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా నాయకులు కొమరం కాంతారావు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టీజేఎస్ పార్టీ, జి నాగేందర్ రావు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.